Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వేరొకరిని పెండ్లి చేసుకునేందుకు విడాకులు ఇవ్వాలని కోరిన మాజీ భార్యను తీవ్రంగా హింసించి ఆమె ముక్కు కోసిన వ్యక్తి ఉదంతం పాకిస్తాన్లోని గుజర్ఖాన్ ప్రాంతంలో వెలుగుచూసింది. చట్టపరంగా వేరుపడేందుకు భార్య తీసుకున్న నిర్ణయంతో ఆగ్రహించిన వ్యక్తి ఈ దారుణానికి తెగబడటం కలకలం రేపింది. గుజ్రత్కు చెందిన గులాం ఫరీద్ ఎనిమిదినెలల కిందట మర్యాంను వివాహం చేసుకున్నాడు. మర్యాం మాజీ భర్త తాజ్ దిన్ వీరి వివాహాన్ని అంగీకరించకుండా ప్రతీకారంతో రగిలిపోయాడు. బంధువుల సాయంతో ఆమెను మిర్పూర్కు తీసుకువెళ్లిన నిందితుడు ఆమె కాళ్లు చేతులను కట్టిపడేసి చాకుతో ముక్కును కత్తిరించాడు. అక్కడినుంచి గుజర్ ఖాన్ ప్రాంతంలోని దాల్మియాకు తీసుకువెళ్లి అక్కడా వేధింపులకు గురిచేశాడు. నిందితుడు తన కాళ్లు, చేతులు కట్టేసి ఈ దారుణానికి పాల్పడ్డాడని, తన కాళ్లను కోసివేసేందుకు ప్రయత్నించగా తాను కేకలు వేయడంతో పారిపోయాడని బాధితురాలు చెప్పారు.