Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అది ప్రతిష్ఠాత్మక ఇంజనీరింగ్ కాలేజీ ఉన్న ప్రాంతం. ఆ రోడ్డంతా బిజీబిజీగా ఉంటుంది. అలాంటి చోట ఫ్లై ఓవర్ కింద రోడ్డుపై భారీ గొయ్యి పడింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జంఝాటాలను తెచ్చింది. ఢిల్లీలోని ఐఐటీ ఫ్లైఓవర్ వద్ద ఈ ఘటన జరిగింది. భారీ గొయ్యి పడడంతో ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అక్కడి నుంచి వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. ఐఐటీ నుంచి అధ్చినికి వెళ్లే వాహనాలను కత్వారియా సరాయి గుండా దారి మళ్లించామని, వాహనదారులు ఈ విషయాన్ని గుర్తించి ఆ మార్గంలో వెళ్లొద్దని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కాగా, దాదాపు 10 నుంచి 15 అడుగుల లోతుతో ఆ గొయ్యి ఏర్పడినట్టు తెలుస్తోంది. ప్రజాపనుల విభాగం అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గొయ్యిని పూడ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.