Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వయసు మళ్లిన ధనవంతులు డబ్బులు ఇచ్చి అమ్మాయిలతో డేటింగ్ చేయడానికి ఉపయోగించే యాప్స్.. షుగర్ యాప్స్. ఇవి విదేశాల్లో చాలా పాపులర్. ఈ యాప్స్‌కు భారత దేశంలోనూ డిమాండ్ ఉంది. అయితే వీటిని సెప్టెంబర్ 1 నుంచి ప్లే స్టోర్ నుంచి తొలగించబో తున్నట్లు గూగుల్ ప్లేస్టోర్ స్పష్టం చేసింది. ఈ మేరకు గూగుల్ ప్లేస్టోర్ ఓ ప్రకటన విడుదల చేసింది.
షుగర్ యాప్స్ అనేవి ముమ్మాటికీ డేటింగ్ యాప్స్ ముసుగులో వ్యభిచారం నడిపించడమేనని గూగుల్ ప్లేస్టోర్ తెలిపింది. ఇక మూములు డేటింగ్ యాప్‌లు కూడా ఇలా అశ్లీలతను పెంపొందించేలా వ్యవహరిస్తే.. వాటి మీద కూడా బ్యాన్ తప్పదని హెచ్చరించింది.
షుగర్ యాప్స్ లో ఎస్డీఎం, స్పాయిల్, షుగర్ డాడీ.. బాగా పాపులర్ అయ్యాయి. అయితే షుగర్ డాడీ యాప్స్ మొత్తం సెక్సువల్ యాక్ట్స్ కిందకే వస్తాయని.. సెక్సువల్ కంటెంట్ మీద నిషేధం విధిస్తున్నట్టు గూగుల్ ప్రకటించింది.