Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రాష్ర్టంలో కొత్తగా మంజూరైన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించాలని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయించింది. మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోవడానికి సమకూర్చుకోవాల్సిన మౌలిక వసతులు, కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యల గురించి కేబినెట్ చర్చించింది. ఆదివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో, భవిష్యత్తులో అనుమతించబోయే మెడికల్ కాలేజీల కోసం స్థలాన్వేషణ, తదితర సౌకర్యాల రూపకల్పనకు సంబంధించి ముందస్తు చర్యలను ఇప్పటి నుంచే ప్రారంభించాలని వైద్యాధికారులను ఆదేశించారు. అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించాలన్నారు.