Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జగద్గిరిగుట్టలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బాలుడు రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తుండగా కారు అతన్ని ఢీకొట్టింది. దాంతో బాలుడికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలుడిని అతని తండ్రి బైక్ ఉంచి రోడ్డు అవతలి వైపునకు వెళ్లాడు. కాసేపటికే బాలుడు తన తండ్రి వద్దకు వెళ్లేందుకు పరిగెత్తుకుంటా రోడుపైకి వెళ్లాడు. అప్పుడే రోడ్డుపై వేగంగా వచ్చిన కారు.. బాలుడిని ఢీకొట్టింది. దాంతో బాలుడికి గాయాలయ్యాయి. ఈ దృశ్యాలు స్థానిక సీసీ పుటేజ్‌లో రికార్డయ్యాయి.