Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బాచుపల్లిలో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదం వీడియోని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విటర్లో షేర్ చేశారు. దీని ద్వారా మీరు ఏం గమనించారు అనే క్యాప్షన్‌తో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ బైకర్ ఓవర్ టేక్ చేసేందుకు ప్రయత్నిస్తూ.. లారీ ముందుకు వెళ్లి స్కిడ్ అయి కింద పడ్డాడు. అయితే ఇది గమనించని లారీ డ్రైవర్ ఫాస్ట్‌గా వెళ్లడంతో బైకర్ మీద నుండి లారీ పోనిచ్చాడు. దీంతో ఆ బైకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఓవర్టేక్ చేయాలనే అర సెకను కోరిక.. బైకర్‌కి.. అతని కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని షేర్ చేశామని.. ఇతరుల అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు అంటూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తమ ట్విటర్లో దీన్ని షేర్ చేశారు.