Watch: Surveillance footage shows the moment in which a woman tries to run over a man three times in a street in #Baltimore, US.https://t.co/ds4uVPjzwk pic.twitter.com/YzRVLwvOQ8
— Al Arabiya English (@AlArabiya_Eng) August 2, 2021
Authorization

హైదరాబాద్: ఓ మహిళ తన భర్తపై కారు ఎక్కించేందుకు పలుమార్లు ప్రయత్నించింది. అతని ఎలాగైనా కారుతో తొక్కించాలని చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. భార్యభర్తలు ఇద్దరు సోషల్ మీడియా పరిచయంతో పెళ్లి చేసుకున్నారు. అయితే వారిద్దరు మేరీలాండ్ బాల్టిమోర్‌లోని రెసిడెన్షియల్ స్ట్రీట్‌లో.. రోడ్డు మధ్యలో ఉండి గొడవపడ్డారు. అనంతరం భార్య కారులోనే కూర్చుని ఉండగా.. కారు వెనకాల డిక్కీలో నుంచి వస్తువులను తీసుకోవడం ప్రారంభించాడు. అయితే కారులో ఉన్న భార్య.. ఒక్కసారిగా కారును వెనక్కి పోనిచ్చింది. భర్తపైకి కారు ఎక్కించాలని చూసింది. కారు తన మీదకు దూసుకురావడంతో అతడు ఒక్కసారిగా షాక్ తిన్నాడు. అయితే చివరకు కారు తనపైకి ఎక్కుకుండా తప్పించుకోగలిగాడు. ఆ తర్వాత కూడా ఆమె.. తన భర్తపైకి పలుమార్లు కారు ఎక్కించాలని చూసింది. దీంతో అతడు పరిగెత్తాడు. ఈ క్రమంలోనే అతడి చర్యలు.. కారులో ఉన్న భార్యను రెచ్చగొట్టేవిగా కనిపించాయి. ఇలా పలుమార్లు భార్య కారు ఎక్కించేందుకు ప్రయత్నించినా.. అతడు విజయవంతంగా తప్పించుకోగలిగాడు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.