Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ మూవీస్, టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఆవిర్భవించింది. కార్మిక శాఖ ఆమోదం వ్యక్తం చేస్తూ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేసింది. యూనియన్ అధ్యక్షురాలు వి.కవిత, ప్రధాన కార్యదర్శి ఎస్.సి.శేఖర్ నియమితులయ్యారు. వారు మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అవుతోన్నా టీవీ, సినీ పరిశ్రమలో తెలంగాణ నటీనటులకు ప్రాధాన్యం మాత్రం లభించడం లేదన్నారు. ఇక మీదట సినీ కార్మికులకు అండగా నిలిచేందుకు యూనియన్ పనిచేస్తుందన్నారు.