Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీహార్లోని గయ జిల్లాలోని ఒక ప్రేమ జంట బుల్లెట్ బండి పై ఫీట్లు చేశారు. అది చూసిన స్థానిక గ్రామస్తులు వారిని వెంబడించి వారికి బుద్ధి చెప్పారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రేమ జంట సినీ స్టయిల్లో బుల్లెట్పైన ఒకరికి ఎదురుగా ఒకరు కూర్చుని రోడ్ల పై తిరగసాగారు. యువకుడు బైక్ నడుపుతుండగా పెట్రోల్ ట్యాంక్ పై యువతి కూర్చుంది. అది చూసిన స్థానికులు వారిని వెంబడించారు. అనంతరం వారిని ఆపి వారి చిరునామా తెలుసుకుని వారికి బుద్ధి చెప్పారు. దాంతో ఆ ప్రేమ జంట క్షమించాలని, ఇంకోసారి అలా చేయబోమని ప్రాధేయపడ్డారు. కాగా ఈ ఉదంతంపై దర్యాప్తు చేస్తున్నట్లు గయ ఎస్ఎస్పీ ఆదిత్యకుమార్ తెలిపారు.