Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం పుష్ప. ఈ చిత్రం ఆగస్ట్ 13న విడుదల కానుందని గతంలో ప్రకటించారు. అయితే కరోనా నేపథ్యంలో పలుమార్పు షూటింగ్ కు అడ్డంకులు ఎదరయ్యాయి. అనంతరం ఇటివల ఆ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమై కొనసాగుతోంది. రీసెంట్ గా ఈ సినిమా మొదటి భాగం రిలీజ్ డేట్ ను మూవీ మేకర్స్ అనౌన్స్ చేశారు. డిసెంబర్ లో పుష్ప-1 ను రిలీజ్ చేయనున్నారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన సింగిల్ ట్యూన్ ను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. ఐదు భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది.