Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మనం ఇప్పటివరకు నో స్మోకింగ్ జోన్ లు చూసుంటాం. అయితే ఎన్నో జంటలు బహిరంగంగా ముద్దులు పెట్టుకోవడం తట్టుకోలేక అక్కడి ప్రజలు నో కిస్సింగ్ జోన్ అనేది కూడా ఒకటి ముంబాయిలో ఏర్పాటయింది.
పూర్తి వివరాల్లోకెళ్తే .. ముంబైలోని బోరివలి ప్రాంతంలో ఉన్న సత్యం శివం సుందరం సొసైటీ హౌజింగ్ సొసైటీ ప్రధాన గేటు వద్ద లాక్డౌన్ సమయంలో నిత్యం ఎన్నో జంటలు కార్లు, బైక్ లపై వచ్చి బహిరంగంగా ముద్దులిచ్చుకున్నారు. పలు జంటలకు అక్కడి స్థానికులు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండాపోయింది. దాంతో సొసైటీ వారు 'నో కిస్సింగ్ జోన్` ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రధాన గేటు రోడ్డుపై పెద్ద పెద్ద అక్షరాలతో 'నో కిస్సింగ్ జోన్` అని రాయించారు. దాంతో బహిరంగ ముద్దులు పెట్టుకోవడం నిలిచిపోయింది. ఈ మేరకు సొసైటీ వాళ్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అడ్వకేట్, సొసైటీ చైర్మెన్ వినయ్ అన్సుర్కర్ మాట్లాడుతూ తామూజంటలకువ్యతిరేకం కాదని, కానీ తమ ఇండ్ల బయట నీచమైన పనులకు వ్యతిరేకమని చెప్పారు. అక్కడ పిల్లలు ఉంటారని అందుకే అలా ఏర్పాటు చేశామని తెలిపారు.