Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్, మెలిందా గేట్స్ తమ 27 ఏళ్ల వివాహ బంధానికి అధికారికంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. తాము విడిపోతున్నట్టు మూడు నెలల క్రితమే వారు ప్రకటించినా.. తాజాగా ఇవ్వాళ కోర్టు విడాకులను మంజూరు చేసింది. వాషింగ్టన్ లోని కింగ్ కౌంటీ కోర్టు జడ్జి వారి వివాహాన్ని రద్దు చేశారు. విడాకుల ఒప్పందానికి తగ్గట్టు ఆస్తులను పంచుకోవాల్సిందిగా ఆదేశించారు. షరతుల ప్రకారం ఆ వివరాలన్నింటినీ గోప్యంగా ఉంచాలన్నారు. కాగా, విడాకుల విషయం బయటకు వచ్చిన కొన్ని రోజుల్లోనే మెలిందా ఫ్రెంచ్ గేట్స్ పేరిట 300 కోట్ల డాలర్ల విలువైన షేర్లను బిల్ గేట్స్ బదిలీ చేశారు. ప్రస్తుతం గేట్స్ దగ్గర 15,000 కోట్ల డాలర్ల సంపద ఉంది. ఆ ఆస్తులను ఎలా విభజిస్తారన్న దానిపై ప్రస్తుతం స్పష్టత లేదు.