Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నాగార్జునసాగర్ నాలుగు క్రస్ట్ గేట్లను అధికారులు ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దాంతో సాగర్ నుంచి 31,140 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలౌతుంది. ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 1,40,056 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 68,041 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ జలాశయ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 587 అడుగులుగా ఉంది. డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 305.50 టీఎంసీలుగా ఉంది.