Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ఆఫ్రికా దేశమైన మాలిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సామగ్రి, కూలీలతో వెళుతున్న లారీ, ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 41 మంది చనిపోయారు. 33 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 20 కిలోమీటర్ల దూరంలోని సెగో పట్టణానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. లారీ టైర్ పేలడంతో డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడని, దీంతో బస్సుకు ఎదురుగా వెళ్లడంతో ప్రమాదం జరిగినట్లు అక్కడి మీడియా వర్గాలు తెలిపాయి. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం తీవ్రంగా ధ్వంసమైంది. ప్రమాద తీవ్రతకు క్షతగాత్రులు రోడ్డుపై చెల్లాచెదురగా పడ్డారు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రోడ్లు ఆఫ్రికా దేశాల్లో దర్శనమిస్తాయి.