Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ మీడియా అకాడమి భవనం నవంబర్ వరకు పూర్తి చేయాలని అకాడమి చైర్మన్ అల్లం నారాయణ సంబంధిత కాంట్రాక్టర్, రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లను కోరారు.నవంబర్ లోగా పూర్తి చేస్తామని కాంట్రాక్టర్, ఇంజనీర్లు చెప్పారు. బుధవారం నాంపల్లిలో మీడియా అకాడమి భవన నిర్మాణ పనులను చైర్మన్ అల్లం నారాయణ పరిశీలించారు. అనంతరం సంబంధిత కాంట్రాక్టర్, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, మీడియా అకాడమి నూతన భవన నిర్మాణ పనులను వేగవంతం చేసి నవంబర్ వరకు జర్నలిస్టులకు అందుబాటులోకి తీసుకురావాలని ఆయన ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.