Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వైద్య కళాశాలల్లో ప్రవేశాల నిమిత్తం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఎన్ఈఈటీ) NEET 2021 కోసం దరఖాస్తు దాఖలు గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పొడిగించింది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కు హాజరు కావాలనుకునే అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 10 వరకు అందజేసేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 6వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుండటంతో.. విద్యార్థుల అభ్యర్థన మేరకు మరోసారి గడువు పొడిగించారు.