Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్ లో పాల్గొన్న భారత హాకీ మహిళల జట్టులో వందనా కటారియా కూడా సభ్యురాలు. ఆమె స్వస్థలం ఉత్తరాఖండ్ లోని రోష్నాబాద్. అయితే, ఒలింపిక్స్ లో అర్జెంటీనా చేతిలో భారత మహిళల హాకీ జట్టు సెమీఫైనల్లో ఓటమి అనంతరం రోష్నాబాద్ లోని వందనా కటారియా ఇంటి ఎదుట ఇద్దరు వ్యక్తులు కుల దూషణలకు పాల్పడ్డారు. వందన కులాన్ని ప్రస్తావిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. బాణసంచా కాల్చుతూ నృత్యాలు చేశారు. భారత మహిళల జట్టులో దళితులు ఎక్కువ మంది ఉన్నారని, అందుకే జట్టు ఓడిపోయిందని అన్నారు. దాంతో వారికి, వందనా కటారియా కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో వందన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు అజయ్ పాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతడిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.