Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పదవీకాలం ముగిసిన నేపథ్యలో ఇద్దరు సభ్యుల స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేయడం తెలిసిందే. పాలనా వ్యహారాల కోసం స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటైంది. ఈ స్పెసిఫైడ్ అథారిటీలో టీటీడీ ఈఓ, అదనపు ఈవో సభ్యులుగా ఉంటారు. తిరుమలలో రేపు స్పెసిఫైడ్ అథారిటీ సమావేశం కానుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు అన్నమయ్య భవన్ లో జరిగే ఈ సమావేశంలో పలు అంశాలను చర్చించనున్నారు. కాగా, ఏపీ ప్రభుత్వం స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేయడం వెనుక భారీ కుట్ర ఉండొచ్చని టీడీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇంతకుముందే వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ఓ అడుగు ముందుకేసి మరింత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక అవసరాలను తీర్చుకోవడం కోసమే స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు చేసినట్టు ప్రజలు ఆందోళన చెందుతున్నారని వెల్లడించారు. దేవుడి సొమ్ము దారి మళ్లించేందుకే స్పెసిఫైడ్ అథారిటీ ఏర్పాటు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయని రఘురామ ఆ మేరకు గతంలోనే సీఎం జగన్ కు లేఖ రాశారు.