Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చెత్త ఫాం కంటిన్యూ అవుతోంది. ఇటీవల వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పెడుతున్న ఈ పరుగుల మిషన్.. మరోసారి అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లి ఆడిన తొలి బంతికే ఔటయ్యాడు. దీంతో మరోసారి గోల్డెన్ డక్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అండర్సన్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ కోహ్లి స్లిప్‌లో ఉన్న బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా కోహ్లి టెస్టుల్లో గోల్డెన్ డక్‌గా వెనుదిరగడం ఇది ఐదోసారి. ఈ ఐదింటిలో మూడుసార్లు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌ల్లో కోహ్లి ఇలా గోల్డెన్‌డక్‌గా వెనుతిరిగాడు. ఇందులో 2014లో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో లియామ్ ప్లంకెట్ బౌలింగ్‌లో, 2018లో ఓవల్ వేదికగా జరిగిన టెస్టులో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో రెండుసార్లు గోల్డెన్ డక్ అయ్యాడు. తాజాగా అండర్సన్ బౌలింగ్‌లో మరోసారి గోల్డెన్ డక్ అయ్యాడు. కాగా గోల్డెన్ డక్ విషయంలో కోహ్లి మరోచెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీమిండియా కెప్టెన్‌గా మూడుసార్లు గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. దీంతో ఈ చెత్త రికార్డుల్లో భారత నెంబర్ వన్ కెప్టెన్ గా నిలిచాడు. లాలా అమర్నాథ్, కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీలు టెస్టు కెప్టెన్లుగా రెండేసీ సార్లు గోల్డెన్ డక్ అయ్యారు.