Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాద్రి కొత్తగూడెం: అల్లారుముద్దుగా పెంచుకున్న ఒక్కగానొక్క కూతురు అనారోగ్యంతో మృతి చెందింది. కూతురు మరణంతో ఆమె తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురు లేని జీవితం తమకెందుకని చివరికి ఆ దంపతులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన గురువారం రాత్రి వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఈసీఎల్కు చెందిన పమ్మి లక్ష్మణాచారి (55), హేమలత (48) దంపతుల కుమార్తె సాత్విక పది రోజుల క్రితం అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. అప్పటి నుంచి కుమార్తె లేని జీవితం తమకొద్దంటూ మనోవేదనకు గురయ్యారు. పాల్వంచలో ఉన్న హేమలత సోదరుడు వేమనకుమార్ వారిని తన ఇంటికి బుధవారం తీసుకువచ్చాడు. వేమనకుమార్ పని నిమిత్తం బయటకు వెళ్లగా ఆ సమయంలో దంపతులిద్దరూ గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు.