Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వ్యాక్సిన్ వేసుకోకుండా ఆఫీసుకు వస్తున్నారని ముగ్గురు ఉద్యోగులను అమెరికాలోని ప్రముఖ న్యూస్ టీవీ ఛానల్ సీఎన్ఎన్ తమ సంస్థ నుంచి తొలగించింది. ఈ విషయాన్ని ఓ మెమో ద్వారా తోటి ఉద్యోగులకు సీఎన్ఎన్ చీఫ్ జెఫ్ జుకర్ తెలియజేశారు. ఆఫీసుకు రావాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోవాలని వారు పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసుకోని వారిని సహించబోమన్నారు.
ఆ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న మూడవ వంతు సిబ్బంది ఆఫీసుకు వస్తున్నట్టు సంస్థ తెలిపింది. అయితే వ్యాక్సిన్ వేసుకున్నట్లు సర్టిఫికేట్ ఉండాలని స్పష్టం చేసింది.