Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పలు జిల్లాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆయా జిల్లాల్లో అధికారులు కఠిన లాక్ డౌన్ లు విధిస్తున్నారు. చిత్తూరు, తూర్పుగోదావరి, నెల్లూరు, కృష్ణాజిల్లాల్లో రోజుకు 250 నుంచి 350 మధ్య కేసులు నమోదవుతున్నాయి. దాంతో తాజాగా నెల్లూరు జిల్లాలో అధికారులు లాక్ డౌన్ విధించారు. నెల్లూరు నగరంతో పాటు కావలి పట్టణంలో ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకే సడలింపులిచ్చి సాయంత్రం 6గంటల నుంచి తర్వాతి రోజు ఉదయం 6గంటల వరకు కఠిన లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. ఆత్మకూరు, సంగం, రాపూరు, పొదలకూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట, తడ, దొరవారిసత్రం, వింజమూరు, వెంకటగిరి మండలాల్లో లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. నెల్లూరు జిల్లాల్లో పాజిటివిటీ రేటు 4.5 శాతంగా ఉంది. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ నెల్లూరులో చాలా మంది కోవిడ్ నిబంధనలు పాటించకపోవడంతో కేసులు పెరుగుతున్నాయన్నారు. కావున పది మండలాల్లో లాక్ డౌన్ ను తాము విధించినట్టు చెప్పారు.