Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విశాఖలో తన అకాడమీ నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించిందని.. త్వరలోనే ఏర్పాట్లు పూర్తి చేసి క్రీడాకారులకు శిక్షణ ఇస్తానని పీవీ సింధు చెప్పారు. శుక్రవారం ఏపీ సీఎం జగన్‌ను ఆమె కలిశారు. ఈ సందర్భంగా ఆమెను ఒలింపిక్స్‌లో పతకం సాధించినందుకు సీఎం అభినందించారు. ప్రభుత్వం తరపున సింధుకు రూ.30 లక్షల నగదును అధికారులు అందించారు. ఒలింపిక్స్‌లో మంచి ప్రతిభ చూపారని.. విశాఖలో వెంటనే అకాడమీని ప్రారంభించాలన్నారు. రాష్ట్రం నుంచి మరింత మంది సింధులు తయారు కావాలని ఆకాంక్షించారు
అనంతరం సింధు మాట్లాడుతూ ఒలింపిక్స్‌కు వెళ్లేముందు పతకంతో తిరిగి రావాలని సీఎం ప్రోత్సహించారని తెలిపారు. క్రీడాకారుల ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సంతోషదాయకమన్నారు. ఏపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందన్నారు. ఉద్యోగాల్లో స్పోర్ట్స్‌కు 2 శాతం రిజర్వేషన్ గొప్ప విషయమన్నారు. నేషనల్స్‌లో గెలిచిన వారికి వైఎస్సార్ పురస్కార అవార్డులు ఇస్తున్నారన్నారు.