Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కరోనా తన జన్యు క్రమాన్ని మార్చుకుంటూ విజృంభిస్తూనే ఉంది. తాజాగా మంగళూరులోని ఓ వ్యక్తిలో ఈటా వేరియంట్ రకాన్ని గుర్తించినట్టు వైద్యులు తెలిపారు. బ్రిటన్‌లో తొలిసారి గుర్తించిన ఈటా వేరియంట్ ఇప్పుడు భారత్‌లో వెలుగుచూసింది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు నాలుగు నెలల క్రితం దుబాయ్ నుంచి దక్షిణ కన్నడ జిల్లాలోని మూదబిద్రే గ్రామానికి వచ్చాడు. పరీక్షలు నిర్వహించగా అతని కరోనా పాజిటివ్‌గా తేలింది. కొద్ది రోజుల తర్వాత అతను కోలుకున్నాడు. అయితే అతనితో సన్నిహితంగా ఉన్న 100 మందికిపైగా గుర్తించి పరీక్షలు నిర్వహించారు. అలాగే పరిశోధన చేసేందుకు బాధితుడి నమూనాలను పరిశోధన కేంద్రానికి పంపారు. దాంతో ఆ వ్యక్తిలో ఈ కొత్త రకం వేరియంట్ బయటపడింది.