Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గత మూడు రోజులుగా రికార్డు స్థాయిలో లాభాలు అందించిన స్టాక్ మార్కెట్ శుక్రవారం నష్టాలతో ముగిసింది. రెపోరేటు, రివర్స్ రెపోరేటు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసిన ప్రకటన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపినట్టు తెలుస్తోంది. బీఎస్సీ సెన్సెక్స్ ఉదయం 54,492 పాయింట్లతో ప్రారంభమై ఆ వెంటనే స్వల్ప నష్టాలపాలైన వెంటనే కోలుకుంది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 215 పాయింట్లు నష్టపోయి 54,277 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 56 పాయింట్లు నష్టపోయి16,238 పాయింట్ల వద్ద క్లోజైంది.