Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సైమా అవార్డ్స్ వేడుకలకు తేదీలు ఖరారయ్యాయి. 'సెప్టెంబరు 11, 12న సినిమా పండగ జరుపుకొందాం` సైమా ప్రతినిధులు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. ఈ వేడుకలను ఎప్పటిలాగా విదేశాల్లో కాకుండా ఈ సారి హైదరాబాద్ వేదికగా నిర్వహించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమకి చెందిన నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణుల్ని ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం 2012లో మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 8 సార్లు ఈ అవార్డులను అందజేశారు. కరోనా కారణంగా గతేడాది సైమా అవార్డులను నిర్వహించలేదు.