Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణలో తక్షణమే అసెంబ్లీని సమావేశపర్చి వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ఏకవాక్య తీర్మానం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో రైతుల ధర్నాకు కేసీఆర్ ప్రత్యక్షంగా మద్దతు తెలపాలని పేర్కొన్నారు. ఢిల్లీలో ధర్నా చేస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా ధర్నాకు రేవంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఎనిమిది నెలలుగా రోడ్లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవట్లేదన్నారు. టీఆర్ఎస్ ఎంపీలు కనీసం రైతులకు సంఘీభావం తెలపలేదని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.