Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తొర్రూరు నుంచి జనగాం వైపునకు వెళ్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కారుకు శుక్రవారం సాయంత్రం త్రుటిలో ప్రమాదం తప్పింది. మంత్రి కాన్వాయ్ కొడకండ్లలోని హక్యా తండా సమీపంలోకి చేరుకుంటుండగా..ఇనుప చక్రాల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ నుంచి ఒక చక్రం అకస్మాత్తుగా రోడ్డుపై పడింది. అప్పటికే మంత్రి కారు దాటుకుని వెళ్లిపోగా వెనుక ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తాకి రోడ్డుపై పడిపోయింది. బుల్లెట్ ప్రూఫ్ వాహనానికి కొంత నష్టం కలిగింది. కొద్దిదూరం వెళ్లిన మంత్రి.. వాహనానికి ప్రమాదం జరిగిందని తెలుసుకొని వెనక్కు వచ్చారు. చిన్న సంఘటనతో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని తెలుసుకున్న మంత్రి తిరిగి కాన్వాయ్‌తో జనగాం వైపు వెళ్లారు.