Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పశ్చిమ గోదావరి: లంచం తీసుకుంటూ ఎస్సై, ఏ.ఎస్సై, కానిస్టేబుల్ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ కేసు విషయంలో లంచం తీసుకుంటూ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్కు చెందిన ఎస్సై ఆనంద్ రెడ్డి, ఏ.ఎస్సై ఇమామ్, కానిస్టేబుల్ మధు ఏసీబీ వలకు చిక్కారు. ఓ కేసు విషయంలో లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముగ్గురిని అరెస్ట్ చేసి విజయవాడ ఏసీబీ కోర్టుకి తరలించారు.