Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయవాడ: పులిచింతల ప్రాజెక్ట్‌లో కనిష్ట స్థాయికి నీటిమట్టం చేరింది. విద్యుదుత్పత్తి నిలిచింది. కొట్టుకుపోయిన 16వ గేట్ స్థానంలో స్టాఫ్లాక్ అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పులిచింతల 16, 17 గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది. 11 స్టాప్‌లాక్ గేట్ ఫ్రేమ్లకు గానూ నిపుణులు 3 ఫ్రేమ్‌లను అమర్చారు. పులిచింతల ఇన్ ఫ్లో 15,517 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 70,740 క్యూసెక్కులు. పులిచింతల పూర్తి నీటిమట్టం 175 అడుగులు కాగా.. ప్రస్తుతం 125.65 అడుగులకు చేరుకుంది. పులిచింతల పూర్తి నీటినిల్వ 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 5.28 టీఎంసీలకు చేరుకుంది.