Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలపై నటి హేమ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఏడాది ‘మా’ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడేలా కొంతమంది చూస్తున్నారని.. లేదా ఎన్నికలు లేకుండా నరేశ్నే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె వ్యాఖ్యలు చేశారు. రూ.5 కోట్ల నిధుల్లో రూ.3 కోట్లు నరేశ్ ఇప్పటివరకూ ఖర్చు చేశారని.. మిగతావి ఏం చేశారని ఆమె ప్రశ్నించారు. అధ్యక్ష పీఠం నుంచి దిగకుండా ఉండేందుకు నరేశ్ ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె తీవ్రంగా ఆరోపించారు.