Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: జపాన్లో ఓ ఉన్మాది రైలులో ప్రయాణిస్తున్న వారిపై కత్తితో దాడి చేశారు. ఆ ఘటనలో 10 మంది గాయపడ్డారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ కేసులో 36 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆ ఉన్మాది సంతోషంగా కనిపించే ఆడవాళ్లను టార్గెట్ చేసి హత్య చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. టోక్యో పశ్చిమ దిశలో ఉన్న ఒడక్యూ రైల్వే లైన్లో ఈ దాడి ఘటన జరిగింది. ఆరేళ్ల క్రితం ఎవరైతో సంతోషంగా ఉన్నట్లు కనిపించారో, ఆ మహిళల్ని చంపాలన్న ఫీలింగ్ వచ్చినట్లు ఆ ఉన్మాది పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.