Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కడప: మాజీ మంత్రి వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ 62వ రోజూ కొనసాగుతోంది. హత్యకు ఉపయోగించిన ఆయుధాల కోసం పులివెందుల వాగులో సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఈ కేసులో సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు పులివెందులకు తీసుకెళ్లారు. అతడిచ్చిన సమాచారంతో ఆయుధాల కోసం గాలింపు చేపట్టారు. సునీల్ సమక్షంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. వివేకా ఇంటి సమీపంలోని వాగులో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు మున్సిపల్ ట్యాంకర్లతో వాగులో నీటిని అధికారులు తోడేయిస్తున్నారు.