Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టోక్యో ఒలింపిక్స్ లో భారత స్టార్ రెజ్లర్ భజరంగ్ పునియా కాంస్యం నెగ్గాడు. ఈ మధ్యాహ్నం కాంస్యం కోసం జరిగిన పోరులో భజరంగ్ 8-0తో కజకిస్థాన్ కు చెందిన దౌలత్ నియాజ్ బెకోవ్ ను మట్టికరిపించాడు. పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 65 కేజీల విభాగంలో జరిగిన ఈ పోరులో భజరంగ్ పునియా తన స్థాయికి తగిన ప్రదర్శన కనబరిచాడు. సెమీఫైనల్లో ఓటమి అనంతరం కుంగిపోకుండా, ఈ మ్యాచ్ లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించి భారత్ ఖాతాలో ఆరో పతకాన్ని చేర్చాడు. భజరంగ్ పతక సాధనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. టోక్యో నుంచి సంతోషకరమైన వార్త అందిందని తెలిపారు. భజరంగ్ కళ్లు చెదిరే పోరాటం కనబర్చాడని కితాబిచ్చారు. ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసే విజయం సాధించినందుకు నీకు శుభాభినందనలు అంటూ భజరంగ్ ను ఉద్దేశించి ట్వీట్ చేశారు.