Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : జగిత్యాల మున్సిపాలిటీలో ఉద్యోగం పోవడంతో ఓ కాంట్రాక్టు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. చిట్ల శేఖర్ అనే వ్యక్తి జగిత్యాల మున్సిపాలిటీలో శానిటేషన్ విభాగంలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కాంట్రాక్టు గడువు కొద్ది రోజుల క్రితం ముగిసిపోయింది. కానీ ప్రభుత్వం వీరిని రెన్యూవల్ చేయలేదు. దీంతో 8 మందిని విధుల నుంచి తొలగించారు అధికారులు. దీంతో మానసిక క్షోభకు గురైన శేఖర్.. ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకున్నాడు.