Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అమరావతి: పులిచింతల ప్రాజెక్టు 16వ గేటులో స్టాప్‌లాగ్ ఎలిమెంట్ అమర్చే పనులు పూర్తయ్యాయి. 16వ గేట్ స్థానంలో మొత్తం 11 స్టాప్ లాక్స్ ఏర్పాటు చేశారు. అధికారులు ఇవాళ మరోసారి స్టాప్ లాక్స్‌ను పరిశీలించనున్నారు. 15 రోజుల్లో పులిచింతల ప్రాజెక్టు తిరిగి నిండు కుండలా మారనుంది. గడిచిన గురువారం తెల్లవారుజామున వరద నీటిని దిగువకు విడుదల చేసే క్రమంలో ప్రాజెక్ట్ 16వ నంబర్ గేటు ఊడిపోయిన విషయం తెలిసిందే. వరదనీటిలో గేటు 500 మీటర్ల మేర కొట్టుకుపోయింది. దీంతో ప్రాజెక్టులోని నీటిని మొత్తం ఖాళీ చేసి 16వ గేటు వద్ద స్టాప్‌లాగ్ ఎలిమెంట్స్‌ను ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ఏర్పాటు చేసి నీటి వృథాను అరికట్టారు.