Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్గొండ: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నదులలో వరద ప్రవాహం పెరిగింది. దీంతో రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. సాగర్‌కు స్వల్పంగా వరద వస్తోంది. అధికారులు ప్రాజెక్ట్ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల కాగా, ప్రస్తుతం 590 అడుగులకు చేరి నిండుకుండలా మారింది. సాగర్ ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 59,395 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. సాగర్ పూర్తిస్థాయి, ప్రస్తుత నీటి నిల్వ 312.0450 టీఎంసీలుగా ఉంది.