Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నరేశ్కుప్పిలి దర్శకత్వంలో హీరో విశ్వక్ సేన్ నటించిన చిత్రం 'పాగల్`. ఈ చిత్రం ఆగస్ట్ 14న థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఇప్పటికే చిత్రానికి సంబంధించి టీజర్, ట్రైలర్ విడుదలయ్యాయి. రధన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని దిల్‌రాజు సమర్పణలో శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, లక్కీ మీడియా బ్యానర్స్ పతాకాలపై బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. నివేద పేతురాజ్ హీరోయిన్ గా నటించింది.