Authorization
Mon Jan 19, 2015 06:51 pm
టోక్యో: అందరి సహకరాంతోనే తనకు ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించే ఘనత దక్కిందని జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా చెప్పారు. ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడిన ఆయన.. తన ప్లానింగ్‌లో ఏనాడూ క్రీడలకు స్థానం లేదని, దేశం కోసం ఆడి బంగారు పతకం సాధిస్తానని అస్సలు ఊహించలేదని ఆయన తెలిపారు. స్టేడియానికి వెళ్లడం, అక్కడ స్నేహితులు జావెలిన్ విసురుతుంటే చూసి తాను విసరడం అంతా అనుకోకుండా జరిగిందని గుర్తుచేసుకున్నారు. తన కుటుంబంలోగానీ, గ్రామంలోగానీ గుర్తింపు పొందిన క్రీడాకారులు ఎవరూ లేరని, అయినా అనుకోకుండా తాను జావెలిన్ త్రో పై మక్కువ పెంచుకుని సాధన చేశానని నీరజ్ చోప్రా తెలిపారు. ముందుగా ఆటల్లోకి రావాలన్న ఆసక్తి లేకపోయినా జావెలిన్ త్రో పై ఇష్టం ఏర్పడిన తర్వాత చాలా హార్డ్‌వర్క్ చేశానని, అందుకు అందరి నుంచి మంచి సహకారం లభించిందని ఆయన చెప్పారు. తన హార్డ్ వర్కే ఇప్పుడు తనను ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించే స్థాయికి తీసుకొచ్చిందన్నారు.