Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : స్టాఫ్ సెలక్షన్ కమిటీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) టయర్ 1 పరీక్ష కోసం అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి 24వ తేదీ వరకుSSC CGL 2020 టయర్ 1 పరీక్షలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో స్టాఫ్ సెలక్షన్ కమిటీ అడ్మిట్ కార్డులు రిలీజ్ చేసింది. అభ్యర్థులు తమతమ రీజియన్లకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ల ద్వారా అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని కమిషన్ తెలిపింది. SSC CGL 2020 టయర్ 1 పరీక్షల నిర్వహణ కోసం గత డిసెంబర్ 29న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది మే, జూన్ నెలల్లో పరీక్షలు జరుగాల్సి ఉంది. కానీ కరోనా మహమ్మారి విస్తృతి కారణంగా ఆ పరీక్షలను ఆగస్టుకు వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో గ్రూప్ బి, గ్రూప్ సి క్యాటగిరీ పోస్టుల భర్తీ కోసం SSC ఏటా ఈ పరీక్షలు నిర్వహిస్తుంది.