Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రస్తుతం పెండ్లి ముందు వధూవరులు ప్రీ వెడ్డింగ్ షూట్ కు మొగ్గు చూపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఫోటో షూటింగప్పుడు ఎన్నెన్నో ఫన్నీగా ఘటనలు జరిగి అలాంటి వీడియోలు వైరల్ అయిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా అలాంటిదొకటి చోటుచేసుకోగా ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఓ కొలను మధ్యలో ఉన్న వేదికపై ప్రి వెడ్డింగ్ ఫొటోషూట్ జరుగుతోంది. ఆ ఫొటోగ్రాఫర్ వధూవరులను రకరకాల ఫోజులలో ఫొటోలు తీస్తున్నాడు. అయితే వధూవరులిద్దరూ ఒకరినొకరు అల్లుకుని నిలబడాల్సిన రొమాంటిక్ ఫోజును ఫోటోగ్రాఫర్ వివరిస్తున్నాడు ఎలా నిలబడాలో వరుడి దగ్గరగా వెళ్లి చేసి చూపిస్తున్నాడు. అది చూసిన వధువు సిగ్గు ఆపుకోలేక ఫొటోగ్రాఫర్‌ను, వరుడిని కలిపి కొలను నీళ్లలోకి తోసేసింది. వాళ్లిద్దరూ నీళ్లలోపడిపోగానే పగలబడి నవ్వింది ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.