Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : యువతి పట్ల ఓ రౌడీషీటర్ అసభ్యకరంగా ప్రవర్తించగా ఆమె కుటుంబ సభ్యులు అతనిపై దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని దేవరజీవనహళ్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇందిరా క్యాంటీన్ రోడ్డు సమీపంలో రౌడీ షీటర్ మజర్ (45) నివసిస్తున్నాడు. శనివారం ఉదయం బయటకు వచ్చిన అతను ఓ దుకాణం వద్ద యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో యువతి ప్రతిఘటించింది. విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని కొడవలితో మజర్పై దాడి చేసి పారిపోయారు. తీవ్ర రక్తస్రావంతో ఉన్న మజర్ను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే అతన్ని ప్రత్యర్థులే పథకం పన్ని హత్యకు పాల్పడ్డారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం.