Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అతడు తన స్నేహితుడి కోసం హిజ్రాగా మారాడు. స్నేహితుడినే పెండ్లి చేసుకోవాల నుకున్నాడు. కానీ అతని స్నేహితుడు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యయత్నం చేసాడు ఆ యువకుడు. ఈ ఘటన ఏపీలోని ఒంగోలు లో గిద్దలూరు పట్టణంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రాచర్ల మండలం పాలకవీడు గ్రామానికి చెందిన మగ్బూల్, అర్థవీడు మండలంలోని పాపినేనిపల్లెకు చెందిన వినీత్‌లు స్నేహితులు. వీరిద్దరూ కలిసి ఆర్మీ సెలక్షన్స్‌కు వెళ్లేవారు. మగ్బూల్ ఆర్మీకి ఎంపికవ్వగా, వినీత్ ఎంపిక కాలేదు. అయినప్పటికీ ఇద్దరూ ఫోన్లలో మాట్లాడుతకునేవారు. అయితే రెండేండ్ల క్రితం ఎందుకో వినీత్ హిజ్రాగా మారి వినీతగా పేరు మార్చుకున్నాడు. సెలవుపై వచ్చినప్పుడు ఇద్దరూ కలిసి సరదాగా తిరిగేవారు. సహజీవనం కూడా చేశారు.
ఇటీవల సెలవుపై వచ్చిన మగ్బూల్.. గిద్దలూరు పట్టణానికి చెందిన మహిళను వివాహం చేసుకునేందుకు నిశ్చయించుకున్నాడు. శుక్రవారం ఓ కల్యాణ మండపంలో వివాహం చేసుకుంటుండగా, సమాచారం తెలుసుకున్న హిజ్రా వినీత.. పలువురు హిజ్రాలతో కలిసి అక్కడకు వచ్చి పెండ్లిని అడ్డుకుంది. తననే పెండ్లి చేసుకోవాలని పట్టుబట్టింది. మగ్బూల్ అందుకు నిరాకరించడంతో వినీత ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. దాంతో కర్నూలు జిల్లాలోని నంద్యాల వైద్యశాలకు తరలించి చికిత్స చేస్తున్నట్టు సమాచారం.