Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : చారిత్రాత్మక గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసం బోనాలు ఆదివారం ఘనంగా ముగిశాయి. జూలై 11 న ఆలయంలో బోనాలతో తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాసం బోనాలు ప్రారంభం అయ్యాయి. ప్రతి ఆది, గురువారాల్లో జరిగిన 8 పూజలలో నగరం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలి వచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించుకున్నారు. ఆదివారం చివరి పూజ తొమ్మిదో బోనం ఘనంగా నిర్వహించారు. చివరి రోజు గావు, బలిగంప ఊరేగింపులు భక్తి శ్రద్ధలతో జరిపారు. ఆలచ సలహాదారు సిరుగుమల్లె రాజు వస్తాద్, ఆలయ ట్రస్టు ఛైర్మన్ కోయల్ కార్ గోవింద్రాజ్, ఆలయ ఈవో ఎస్.మహేందర్‌కుమార్, అర్చకులు సర్వేశ్వర్ చారి, సభ్యులు స్వరూప, హేమలత, శ్రీధర్, వెంకటేష్ యాదవ్, సాయిలతో పాటు, కులవృత్తుల సంఘం అధ్యక్షులు సాయిబాబా చారి, పూజారి సురేష్ చారి తదితరులు పాల్గొన్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ మైత్రి ,పీస్ కమిటీ సభ్యులు అందించిన సేవలను ఇన్స్పెక్టర్ కొణతం చంద్రశేఖర్ రెడ్డి ఈ సందర్భంగా అభినందించారు.