Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కువైట్లోని భారీ టైర్ డంపింగ్ యార్డ్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్నిప్రమాదం సులైబియా నగరం శివారులోని ఎడారి ప్రాంతంలో నాలుగు రోజుల క్రితమే ప్రారంభమైనట్టు సమాచారం. పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేయడానికి కువైట్ అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పూర్తి వివరాల్లోకెళ్తే.. సులైబియా నగరం శివారులో అతి పెద్ద టైర్ల డంపింగ్ యార్డ్ ఉంది. ఇక్కడ వివిధ దేశాల నుంచి తీసుకొచ్చిన పనికిరాని టైర్లు దాదాపు 70 లక్షల వరకు పోగయ్యాయి. కొన్నేండ్లుగా పొగవుతుండటంతో ఇక్కడ సాధారణంగా వచ్చే ఇసుక తుఫాన్ కారణంగా పాత టైర్లపై ఇసుక నిండిపోయింది. నాలుగు రోజుల క్రితం ఒక్కసారిగా మంటలు లేవడంతో పాత టైర్లు అగ్నికి ఆహుతవడం మొదలయ్యాయి. వీటి నుంచి వెలువడుతున్న పొగ కారణంగా కువైట్ వాసులకే కాకుండా ఇతర దేశాల వారికి కూడా ఆరోగ్య సమస్యలతోపాటు వాతావరణ సమస్యలు పొంచి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి నుంచి వెలువడే పొగలో కార్బన్ మొనాక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్స్ వంటి విషపూరిత రసాయనాలు ఉంటాయని, వీటిని పీల్చుకోవడం వల్ల శ్వాసకోశ సమస్యలతోపాటు క్యాన్సర్ వంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.