Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వరుడు చీర కట్టుకోవడంవ..వధువు షర్టు, ప్యాంటు వేసుకోవడం ఎప్పుడైనా చూశారు,.
పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో అదే జరిగింది. ఇది వారి కుటుంబ ఆచారమంట. కాకతీయుల కాలం నుంచి విభిన్న ఆచారం పాటిస్తున్నారట.
పూర్తివివరాల్లోకెళ్తే.. పశ్చిమగోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో గన్నమని ఇంటి పేరున్న అమ్మాయి పెండ్లి జరిగితే అబ్బాయిగా అలంకరిస్తారు. అంటే ప్యాంటు, షర్టు వేస్తారు. అదే ఆ ఇంటి పేరున్న అబ్బాయికి పెండ్లయితే అమ్మాయిగా అలంకరిస్తారు. అంటే పట్టుచీర, జాకెట్ కట్టి ఆభరణాలతో అలంకరిస్తారు. పెండ్లికి ఒకరోజు ముందు ఇలా అలంకరించి కులదేవత ఆలయానికి లేదా గ్రామ దేవత ఆలయానికి ఊరేగింపుగా తీసుకెళ్ళి మొక్కులు చెల్లించుకుంటారు. ఈ ఆచారాన్ని బోనంగా పిలుస్తారు. వధూవరులను బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామమంతా ఊరేగిస్తారు. గ్రామ దేవత ఆలయానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయిస్తారు. గొర్రెను బలిచ్చి అన్నంతో కుంభం సమర్పిస్తారు ముడుపులు, మొక్కుబడి చెల్లించుకుంటారు.
ఈ ఆచారానికి ఓ కథను సైతం ఆ గ్రామస్తులు చెబుతున్నారు. రుద్రమదేవి వద్ద గన్నమని వంశస్తుల మూల పురుషుడు సైన్యాధ్యక్షుడిగా ఉండేవాడని.. ఆయన హయాంలో సైన్యంలో ఉన్న మగవారు యుద్ధంలో ఎక్కువగా చనిపోయారని చెబుతారు. దాంతో మహిళలు మగవారి వేషధారణలో సైన్యంలో విధులు నిర్వర్తించేవారంటారు. ఈ విషయం బయటకు తెలియకుండా కాపాడమని కులదేవతను వేడుకునేవారని.. పెండ్లి సమయంలో ఆడవారికి మగ వేషం, మగవారికి ఆడవేషం వేసి మొక్కులు చెల్లిస్తామని ప్రార్థించేవారని పలువురు చెబుతున్నారు. అప్పటి నుంచి ఈ ఆచారం కొనసాగుతోందట.