Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గ్యాంగ్స్టర్ నయీమ్ ఎన్ కౌంటర్ జరిగిన నేటికి ఐదేళ్లు పూర్తి అవుతున్న కేసులో ఎందుకు పూర్తి స్థాయి దర్యాప్తు జరగలేదు ? అని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రవణ్ దాసోజు ప్రశ్నించారు. నయీమ్ దగ్గర దొరికిన బ్లూ డైరీ, అతని ఎన్ కౌంటర్ తర్వాత స్వాధీనం చేస్తున్న వేల ఎకరాల భూముల ఆస్తులతోపాటు..వేల కోట్ల రూపాయలపై, సిట్ దర్యాప్త చేసిన వివరాలను ఎందుకు ప్రజల ముందు పెట్టడం లేదని ఆయన ట్విట్టర్ వేదికగా నిలదీశారు. అధికార పార్టీ టిఆర్ఎస్ ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఆరోపణలు ఉన్న వారిపై సిట్ కేసులు ఎందుకు నమోదు చేయలేదు..? చిన్న స్థాయి పోలీసు అధికారాలపై చర్యలు మినహా, సిట్ ఐదేళ్లుగా చేసింది ఏంటి ? సిట్ ఐదేళ్లుగా ఎందుకు పూర్తి చార్జిషీట్లు నమోదు చేయలేదు ? గ్యాంగ్స్టర్ నయీమ్ బాధితులకి ఐదేళ్లలో ఎంత మందికి ప్రభుత్వం న్యాయం చేసింది ? అని దాసోజు శ్రవణ్ ప్రశ్నల వర్షం కురిపించారు.