Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : సైబర్ నేరాలకు పాల్పడుతున్న గుంటూరు జిల్లాకు చెందిన నలుగురు వ్యక్తులను కర్నూల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ వెబ్సైట్లతో మోసం చేసి డబ్బులు ఖాతాలకు బదిలీ చేయించుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఠా అకౌంట్స్‌లో రూ.16.50 లక్షలుండగా.. వాటిని ఫ్రీజ్ చేసి.. రూ.2లక్షల విలువైన నగదును నిందితుల నుంచి రికవరీ చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలో సైతం ఈ ముఠా సైబర్ నేరాలకు పాల్పడినట్లు కర్నూల్ ఎస్పీ సుధీర్‌కుమార్ రెడ్డి తెలిపారు. రూ.100కుపైగా ఫేక్ బ్యాంక్ అకౌంట్స్‌ను ఆపరేట్ చేస్తున్నారని పేర్కొన్నారు. సైబర్‌క్రైమ్ కేసులో ప్రధాన నిందితుడైన గుంటూరు జిల్లాకు చెందిన నవకిశోర్ ఫిలిప్పీన్స్‌లో ఉంటున్నాడని, అతన్ని పట్టుకునేందుకు లుకౌట్ సర్క్యూలర్ రైజ్ చేసినట్లు వివరించారు.