Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ సర్కారుపై మరోమారు ధ్వజమెత్తారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ది కోసమే దళిత బంధు పథకం తీసుకొస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో పరిస్థితి చూస్తుంటే... పథకాలు రావాలంటే ఉప ఎన్నికలు జరగాలన్నట్టుగా ఉందని విమర్శించారు. అందుకే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయాలంటున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే, అప్పుడైనా పథకాలు వస్తాయేమోనని వ్యాఖ్యానించారు. ప్రతి దళిత, గిరిజన, ఆదివాసీలకు రూ.10 లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు.