Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భారత్-ఇంగ్లాండ్ మధ్య నాటింగ్‌హామ్‌లోని ట్రెంట్‌బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టెస్టు వర్షం కారణంగా డ్రాగా ముగిసింది. 157 పరుగులు విజయ లక్ష్యం ఊరిస్తున్న వేళ చివరి రోజు అకస్మాత్తుగా వచ్చిన వాన టీమిండియా విజయావకాశాలను దెబ్బతీసింది. ఐదో రోజు ఒక్క బంతికి పడకుండా మ్యాచ్‌ను వర్షం తుడిచిపెట్టేసింది. నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 52 పరుగులు చేసింది. దీంతో విజయానికి ఇంకా 157 పరుగులే అవసరం కాగా చేతిలో 9 వికెట్లు, రోజంతా ఆట మిగిలే ఉండడంతో విజయం భారత్ సొంతమని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా కురిసిన వర్షం ఐదో రోజు మ్యాచ్‌ను పూర్తిగా అడ్డుకుంది. వేచి చూసినా వర్షం తగ్గకపోవడంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు.